ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రజాకార్' సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 08:18 PM

యాట సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" సినిమా మార్చి 1న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ ని రేపు ఉదయం 11 గంటలకి ప్రసాద్ లాబ్స్ లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా విజయేంద్ర ప్రసాద్ గారు, ధర్మపురి అరవింద్ గారు హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్  సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ చిత్రం లక్ష్యం. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వారి త్యాగాలు మరియు పోరాట సమయంలో వారు ప్రదర్శించిన స్థైర్యాన్ని ఈ చిత్రం వెల్లడిస్తుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక మరియు అన్నుశ్రియ త్రిపాఠి కీలక పాత్రలు  పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com