నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న "దసరా" పాన్ ఇండియా మూవీ ట్రైలర్ రీసెంట్గా విడుదల కాగా, పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా హీరో ఆది పినిశెట్టి కూడా దసరా ట్రైలర్ కి ఫిదా అయ్యి, తన రివ్యూను ట్వీట్ రూపంలో ప్రేక్షకుల ముందుంచారు. దసరా ట్రైలర్ ..రియల్, రా, రస్టిక్, ఫ్యాబులస్ స్టఫ్. నాని, కీర్తిల కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బెస్ట్ అవుతుంది. మరి, మార్చి 30న విడుదల కాబోతున్న ఈ సినిమాను చూడటానికి నాకు చాలా తొందరగా ఉంది... అంటూ ఆది ట్వీట్ లో పేర్కొన్నారు.