టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీసుల వద్ద భీకర కలెక్షన్లను నమోదు చేస్తూ, ఆడియన్స్, క్రిటిక్స్ నుండి పాజిటివ్ రివ్యూలు అందుకున్న రీసెంట్ హిట్ చిత్రం "సార్/వాతి". వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఇక, రేపటి నుండి డిజిటల్ లో క్లాసులు ఇవ్వడం షురూ చెయ్యనున్న సార్/ వాతి తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ ని కూడా అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.సో, రేపటి నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సార్/వాతి మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతుంది.