శాండల్ వుడ్ నుండి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ "కబ్జా". పీపుల్ స్టార్ ఉపేంద్ర, బాద్షా కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో, హీరోయిన్ శ్రేయా శరణ్, కారునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీరోల్స్ లో నటిస్తున్నారు. R. చంద్రు దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 7భారతీయ భాషలలో రేపు ఘనంగా విడుదల కాబోతుంది. ప్రమోషనల్ కంటెంట్ తో అమేజింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో.. చూడాలి.
ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో కబ్జాని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.