కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందించిన లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి".
తాజాగా ఈ సినిమా నుండి "బంజారా" ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ పాటను స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.
నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ ప్రీమియర్ కి రాబోతుంది.