గతేడాది "కృష్ణ వ్రింద విహరి"తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నాగశౌర్య తాజాగా ఈ ఏడాది "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'జ్యో అచ్యుతానంద' తదుపరి నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల డైరెక్టోరియల్ లో తెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్లతో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా రేపే థియేటర్లకు రాబోతుంది. మరి, శ్రీనివాస్ అవసరాల మార్క్ క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ థియేటర్ ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో.. !!