మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్ "మగధీర" రీ రిలీజ్ కాబోతుందని గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మధ్యనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. మరి, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, RC బర్త్ డే ట్రీట్ గా మగధీర కాదు.. ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ కాబోతుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విషయంపై ఇప్పటివరకైతే, ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేదు.
ఐతే, ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ కి ఒక ముఖ్య కారణం ఉందంట. ఆరెంజ్ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే మనీ మొత్తాన్ని, జనసేన పార్టీకి ఫండ్ గా ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించారట. కారణం చాలా మంచిదే ఐతే, చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాన్ని బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అభిమానులు తమ అయిష్టతను వెలిబిచ్చుతున్నారు. ఇక్కడ మరొక విశేషమేంటంటే, ఆరెంజ్ సినిమా ఆ టైం లో ఫ్లాప్ అవ్వొచ్చు కానీ, కంటెంట్ పరంగా ఆ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్.