చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా వెండితెరకు డిబట్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం "బుట్టబొమ్మ". శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వంలో మలయాళ చిత్రం కప్పేలా కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రీసెంట్గానే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుండి 'నీదాకే' అనే బ్యూటీఫుల్ మెలోడియస్ లవ్ సాంగ్ యొక్క ఫుల్ వీడియో విడుదలయ్యింది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ గీతాన్ని చైత్ర అంబడిపూడి ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
ఈ సినిమాలో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ, నవ్య స్వామి కీరోల్స్ లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.