హీరో విశ్వంత్ నటిస్తున్న కొత్త చిత్రం "కథ వెనుక కథ". శుభశ్రీ, శ్రీజిత గౌష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కృష్ణచైతన్య డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ మేరకు మార్చి 24న కథ వెనుక కథ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధు నందన్, ఖయ్యుమ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.