అక్కినేని అఖిల్, స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో "ఏజెంట్" రూపొందుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావలసి ఉండగా, షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏజెంట్ గురించి పక్కన పెడితే, అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన విషయమొకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్ లో అఖిల్ ఒక సినిమాను చెయ్యబోతున్నాడంట. అదికూడా కొత్త దర్శకుడితో. మరి, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ను అతి త్వరలోనే మేకర్స్ ఇవ్వాలని చూస్తున్నారట.