గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "గేమ్ ఆన్". దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. వెంకటేశ్వర రావు కస్తూరి, శ్రీమతి సాక్షి రవి సమర్పిస్తున్నారు. రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు గేమ్ ఆన్ సినిమా నుండి గ్లిమ్స్ వీడియో విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.