ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ టైం రికార్డు ధరకు SSMB28 డిజిటల్ హక్కుల అమ్మకం 

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 04:07 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న న్యూ మూవీ "SSMB 28" యొక్క న్యూ షెడ్యూల్ హైదరాబాద్, అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణ ఈ షెడ్యూల్ లో జరుగుతుంది.


SSMB 28 పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఉంటుందని రీసెంట్గానే అధికారిక ప్రకటన జరిగింది. తాజా సమాచారం ప్రకారం, SSMB 28 అన్ని భాషాల పోస్ట్ థియేట్రికల్ హక్కులను దక్కించుకునేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ 80 కోట్లవరకు ఖర్చు పెట్టిందట.


పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com