ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీసియల్ : 'తలపతి 67' కోసం బోర్డులోకి వచ్చిన KGF విలన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 04:09 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ ద్వారా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో భాగమని ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో సంజయ్ విలన్‌గా నటించే అవకాశం ఉంది అని సమచారం.

తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు మూవీ టీమ్ ఈ ఉదయం కాశ్మీర్‌కు వెళ్లింది. తాజా సమాచారం ప్రకారం, ఈ షెడ్యూల్‌లో సంజయ్ దత్ కూడా సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నార .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com