శ్రీపతి కర్రి డైరెక్షన్లో పక్కా రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం "కోరమీను". ఇందులో ఆనంద్ రవి, కిషోరీ ధాత్రక్ జంటగా నటిస్తున్నారు. హరీష్ ఉత్తమన్, శత్రు, రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామన్యారెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి యుద్ధమేరా అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈపాటను అనంత నారాయణ్ AG స్వరపరచగా, పూర్ణాచారి లిరిక్స్ అందించారు. సింగర్స్ పార్వతి AG, రిడిల్ పాడారు.