ఆన్ స్క్రీన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ - హీరో కాంబోలలో బోయపాటి శ్రీను- నటసింహం నందమూరి బాలకృష్ణ గార్లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
బోయపాటి శ్రీను - బాలకృష్ణ కలయికలో గతేడాది విడుదలైన అఖండ చిత్రం నేటితో యేడాదిని పూర్తి చేసుకుంది. కోవిడ్ పాండెమిక్ నేపథ్యంలో, థియేటర్లకు జనాలు రావాలంటే భయపడుతున్న తరుణంలో అఖండ సినిమా థియేటర్లకు వచ్చి, జనాలను ఇళ్ళనుండి ధియేటర్లకు నడిపించేలా చేసింది.
బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ, నితిన్ మెహతా, విజి చంద్రశేఖర్ కీలకపాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించగా, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు.