బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని జంటగా నటిస్తున్న చిత్రం "నేను స్టూడెంట్ సర్". గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుని ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇకపై పూర్తిగా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టనుంది. ఈ మేరకు రేపు టీజర్ రిలీజ్ కాబోతుంది. హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో రేపు మధ్యాహ్నం ఒంటిగంట నుండి జరగబోయే నేను స్టూడెంట్ సర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ను విడుదల చెయ్యనున్నారు. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది.
ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి డైరెక్టర్ కాగా, నాంది సతీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మహతీస్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.