ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IMDB టాప్ రేటింగ్ సినిమాలలో ఒకే హీరోవి మూడు సినిమాలు ...!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 11:50 PM

IMDB రేటింగ్స్ సంస్థ నుండి తాజాగా ఆల్ టైం టాప్ రేటెడ్ 25 తెలుగు సినిమాల జాబితా విడుదలైంది. ఇందులో కేరాఫ్ కంచెర్లపాలెం (8.4) టాప్ పొజిషన్ లో ఉండగా, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పుటను ఏర్పాటు చేసుకున్న ఆల్ టైం ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ మాయాబజార్ (8.3) సెకండ్ పొజిషన్ లో ఉంది. నాచురల్ స్టార్ నాని నటించిన, జాతీయ అవార్డును పొందిన జెర్సీ (8.3) థర్డ్ పొజిషన్ లో ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన హిలేరియస్ ఫ్యామిలీ డ్రామా నువ్వు నాకు నచ్చావ్ (8.2), హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన రీసెంట్ క్లాసిక్ సీతారామం (8. 2) నాలుగు, ఐదు స్థానాలలో ఉన్నాయి.


విశేషమేంటంటే, 50 సినిమాలున్న ఈ జాబితాలో టాప్ 25లో యువనటుడు అడవిశేష్ నటించిన మూడు సినిమాలుండడం. ఆయన లీడ్ రోల్ లో నటించిన క్షణం (7.9), ఎవరు (7.9), మేజర్ (7.9) సినిమాలు ఈ జాబితాలో వరసగా 17, 18, 22 స్థానాలలో ఉన్నాయి. మరో విశేషమేంటంటే, శేష్ నటించిన మరొక హిట్ మూవీ గూఢచారి ఈ జాబితాలో 40వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం లిస్ట్ చూసుకుంటే, అడవి శేష్ వి నాలుగు సినిమాలున్నాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు అడవిశేష్ వర్సటాలిటీ ఏంటన్నది చెప్పడానికి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com