విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "ఓరి దేవుడా". మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్షన్ చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా సెకండ్ లిరికల్ "అవుననవా" అనే మెలోడియస్ సాంగ్ యొక్క ప్రోమో రిలీజ్ అయ్యింది. పూర్తి పాట సెప్టెంబర్ 27వ తేదీన అంటే రేపు విడుదల కాబోతుంది.
2020లో విడుదలైన కోలీవుడ్ ఫిలిం "ఓహ్ మై కడవులే" కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.