ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT స్ట్రీమింగ్ భాగస్వామిని లాక్ చేసిన 'అల్లూరి'

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 07:59 PM

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా OTT విడుదల తేదీని మేకర్స్ త్వరలో వెల్లడిచేయనున్నారు.


ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని  నిర్మిస్తుండగా,బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com