ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది భాషల్లో సూర్య 42... ఆకట్టుకుంటున్న మోషన్ పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 11:15 AM

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై KE జ్ఞాన్ వేల్ రాజా, వంశీ, ప్రమోద్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ దిశా పటాని జంటగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి సూర్య మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో సూర్య ఫేస్ రివీల్ చెయ్యలేదు కానీ, ఆయన గెటప్ మాత్రం భయంకరంగా కనిపిస్తుంది. విశేషమేంటంటే, ఈ మూవీ పది భాషలలో, 3డిలో రూపొందుతుంది. మొత్తానికి ఈ మోషన్ పోస్టర్ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరిచింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com