తమిళ సీరియల్ నటి వీజే మహాలక్ష్మీ, తమిళ నిర్మాత అయిన రవీందర్ చంద్రశేఖర్ ని పెళ్లి చేసుకుంది. తిరుపతిలో గురువారం వీరి వివాహం జరిగింది. వీరిద్దరికి గతంలో పెళ్లిలయ్యి విడాకులయ్యాయి. వారిని చూసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నిర్మాత నటిని పెళ్లాడాడు. ఇందులో కొత్తదనం ఏముంది? అనే కదా అనుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇప్పటి వరకు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు మరియు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తమ భాగస్వాములతో విడిపోయారు. మళ్లీ ఈ పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి