ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాదేనా ...!"లాల్ సింగ్ చద్దా" పై షాకింగ్ అప్డేట్ ...!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:20 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం "లాల్ సింగ్ చద్దా".  ఇందులో అక్కినేని నాగ చైతన్య  ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాతోనే చైతు బాలీవుడ్ రంగప్రవేశం చెయ్యబోతున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్. లీడ్ రోల్ లో ఆమీర్ నటించగా, ఆయనకు జతగా కరీనా కపూర్ ఖాన్ నటించింది.
పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 11న విడుదలవబోతున్న ఈ మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూ. 160 కోట్ల భారీధరకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ డిజిటల్ ఎంట్రీపై షాకింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, వచ్చే ఏడాది లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవనుందట. అంటే థియేట్రికల్ రిలీజైన ఆరు నెల్ల తర్వాతే లాల్ సింగ్ ఓటిటిలోకి అడుగు పెట్టనున్నాడు. అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఐతే మరి, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com