ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా "దసరా" తర్వాత అలా చెయ్యబోతున్న నాని!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 18, 2022, 04:38 PM

జయాపజయాలకు అతీతంగా నిత్యం చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని. రెస్ట్ తీసుకోకుండా, ఎలాంటి వెకేషన్లకు వెళ్లకుండా గత పది సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూనే ఉన్నాడు. పని చెయ్యడమే తనకు వెకేషన్ లాంటిదని, పనిలోనే ఎక్కువ ఎంజాయిమెంట్ పొందుతానని పలు ఇంటర్వ్యూలలో నాని చెప్పారు.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని యాంకర్ నానిని అడగ్గా, ఈసారి ఆయన నుండి వేరే సమాధానం వచ్చింది. "దసరా" సినిమా తర్వాత సాలిడ్ బ్రేక్ తీసుకుంటానని చెప్పారు. దసరా వంటి హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చేసిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ కంపల్సరీ అని, లేకపోతే మైండ్ సరిగా పని చేయదని చెప్పారు. అంతేకాక ఈసారి నుండి ప్రతి మూవీ పూర్తైన తర్వాత ఒక వెకేషన్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com