కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన "శివాజీ:ది బాస్" కు నేటితో సరిగ్గా పదిహేనేళ్ళు. 2007, జూన్ 15వ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రజినీ కాంత్ ఆల్ టైం హిట్ సినిమాలలో శివాజీ సినిమాకు తప్పకుండా స్థానం ఉంటుంది. ఈ సినిమాలో రజినీ కి జోడిగా శ్రేయా శరణ్, విలన్గా సుమన్, సపోర్టింగ్ రోల్ లో లేట్ రఘువరన్, వివేక్ తదితరులు నటించారు. కమర్షియల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ను సాధించింది. విడుదలైన తొలి వారంలో, UK టాప్ 10 చార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. ఇండియాతో పాటు శ్రీలంక, యూరోప్, US, కెనడా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేసియా వంటి దేశాలలో పెద్ద ఎత్తున విడుదలైంది. ఒక్క శ్రీలంకలోని 70 థియేటర్లలో 700 షోలు పడ్డాయంటే, శివాజీ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోండి.
శివాజీ మూవీ పదిహేనేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజినీ స్వగృహంలో డైరెక్టర్ శంకర్ ఆయనను కలుసుకుని, శివాజీ ముచ్చట్లను చెప్పుకున్నారు. ఈ మేరకు శంకర్ ట్విట్టర్ వేదికగా రజినీతో దిగిన ఫోటోను, శివాజీ మూవీ సాధించిన రికార్డులను పోస్ట్ చేసారు.