ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు తదుపరి ప్రాజెక్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 01:32 PM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మూవీలో చిరంజీవి శంకర్ అనే క్యారెక్టర్‌ని పోషిస్తున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్,కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ సినిమాలో కీర్తి సురేష్ భర్తగా కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. మూవీ మేకర్స్ ఈ విషయం పై ఇంకా అధికారక ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ రానున్న రోజుల్లో ప్రటకించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com