ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మినీ స్ట్రాప్ డ్రెస్ లో మెరిసిన కృతి సనన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:48 PM

డేట్​ నైట్​కి వెళ్లాలనుకుంటే మీరు కృతిసనన్ ఫాలో అయిపోవచ్చు. ఈ తార తన స్టారోరియల్​ లుక్​తో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే కట్టిపడేస్తుంది. తాజాగా స్ట్రాప్ మినీ డ్రెస్​లో మెరిసి.. అభిమానులను ఆకట్టుకుంది. కృతి సనన్ పార్టీ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది. తన స్టైలిష్​ లుక్​తో ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చింది. ఈ మినీ స్ట్రాప్ డ్రెస్​.. సెంటర్ బ్యాక్ జిప్పర్‌తో వచ్చింది. దీనిపై తెల్లటి సీతాకోకచిలుకలు ప్రింట్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


సిల్వర్ హూప్ చెవిపోగులు, లేత గోధుమరంగు డియోర్ బ్యాగ్‌తో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది కృతి. తన సిల్కీ ట్రెస్‌లను మిడ్-పార్టెడ్ హెయిర్‌స్టైల్‌లో కనిపించింది. పింక్ లిప్ గ్లాస్, డ్యూయి మేకప్ లుక్‌తో తన గ్లామ్​ను మరింత పెంచింది. ఈ నీలిరంగు మినీ దుస్తులను అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్ మేఘనా గోయల్ రూపొందించింది. ఈ ట్రెండీ డ్రెస్​ టైమ్‌లెస్, ట్రాన్స్-సీజనల్ కూల్ గర్ల్ స్టేపుల్స్‌ను కలిగి ఉంది. డిజైనర్ వెబ్‌సైట్‌లో దీని ధర రూ.3,913గా ఉంది. కృతి ఒక జత స్ట్రాపీ ఫ్లాట్ చెప్పులతో తన వేషధారణను పూర్తి చేసింది. మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.




 



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com