కోలీవుడ్ లో విలక్షణ నటుడు కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్...ఈ ముగ్గురు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లలో దిగ్గజ ప్రముఖులు. ముగ్గురూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులరైన సెలెబ్రిటీలే. ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చుస్తే, ఎలా ఉంటుంది? అభిమానులకైతే త్రిబుల్ ధమాకా నే! ఈ సంఘటనే నిన్న జరిగింది. విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కు గాను చిరంజీవి కమల్ హాసన్ కు తన స్వగృహంలో విందు ఏర్పాటు చేసారు. ఈ విందులో విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ అండ్ టీం పాల్గొన్నారు. ఒక బాలీవుడ్ మూవీ షూటింగ్ కు గాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న సల్మాన్ ఖాన్ కూడా చిరు ఇంటిలో జరిగిన విందులో పాల్గొన్నారు. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ, చిరు ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేసారు. ఇందులో చిరు కమల్, లోకేష్, సల్మాన్ లకు బొకే లిచ్చి విష్ చేస్తున్నారు. అలానే మరో ఫొటోలో కమల్ కు శాలువా కప్పి సత్కరిస్తున్న చిరు కనిపిస్తారు.