ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క శెట్టి అన్నయ్యకు చంపేస్తామని బెదిరింపులు...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 13, 2022, 12:47 PM

టాలీవుడ్ జేజెమ్మ, దేవసేన అనుష్క శెట్టికి ఒక అన్నయ్య ఉన్నాడన్న విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. అనుష్క శెట్టి అన్నయ్య పేరు గుణరంజన్, కర్ణాటక లో పెద్ద వ్యాపారవేత్త. తనకు ప్రాణహాని ఉందని కర్ణాటక హోమ్ మినిస్టర్ ను కలిసి తనకు రక్షణ కల్పించమని అడగటం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇంతకీ విషయమేంటంటే... 


గతంలో గుణరంజన్, మన్విత్ రాయ్ లు కర్ణాటకలో బాగా పేరుమోసిన ముతప్పారై అనే ఒక మాఫియా డాన్ వద్ద శిష్యరికం చేసారు. ముతప్పారై చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయి, ఎవరి జీవితాల్లో వారు ఎదిగారు. వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయబేధాల వల్ల శత్రువులుగా మారారు. గుణరంజన్ కర్ణాటక లో పెద్ద బిజినెస్ గా మారి, జయ కర్ణాటక జనతా పార్టీ ఫోరమ్ అనే ఒక కార్యాలయాన్ని స్థాపించాడు. ఈ పార్టీ బెంగుళూరు, మంగుళూరులలో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈగో దెబ్బ తిన్న మన్విత్ రాయ్ తనపై హత్య కు పాల్పడే ప్లాన్ చేస్తున్నాడంటూ గుణరంజన్ కర్ణాటక స్టేట్ హోమ్ మినిస్టర్ కు రక్షణ కల్పించమని విన్నవించుకున్నాడు. ఈ ఆరోపణలపై మన్విత్ రాయ్ స్పందిస్తూ, తనకేం తెలియదని, అసలు తానిక్కడ ఉండట్లేదని, అన్నిటికి, అందరికి దూరంగా విదేశాల్లో ఉంటున్నానని, ఎటువంటి నేరచరిత్ర లేని తనపై ఇలాంటి ఆరోపణలు చెయ్యటం సరి కాదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com