ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీనితో భారీ వసూలును రాబడుతుంది. రాబోయే రోజుల్లో కేజీఎఫ్ 3 కూడా రూపొందనుందనే విషయం అందరికి తెలిసిన సంగతే. కేజీఎఫ్ 3లో ఒక కీలక పాత్రలో నటించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై మూవీ మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మూవీ మేకర్స్ 'KGF-3' డిసెంబర్ నెలలోనే సెట్స్‌పైకి వెళ్తుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.