నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ డైరెక్ట్ గా చేస్తున్న తొలి తెలుగు చిత్రమిదే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, లిరికల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ దక్కింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాని ఒక బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నారు. అలాగే ఆయన ప్రేమించే క్రిస్టియన్ యువతి పాత్రలో నజ్రియా నాజిమ్ కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. లీలా పాత్రకు నజ్రియా సొంతంగా డబ్బింగ్ చెప్తుందని తెలుపుతూ, ఒక క్యూట్ వీడియోను మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. తెలుగులో తొలిసారి యాక్ట్ చేస్తున్న నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవటం విశేషం. ఇందుకోసం డబ్బింగ్ ధియేటర్ లో నజ్రియా తెగ కష్టపడుతోంది. తెలుగు డబ్బింగ్ కోసం నజ్రియా పడుతున్న కష్టాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.