చీరలోని గొప్పదనాన్ని తెలుసుకున్నట్టుంది కీర్తి సురేష్. ఎప్పుడు చూసిన చీరలోనే దర్శనమిస్తోంది. తోటి హీరోయిన్స్ సమ్మర్ స్పెషల్ అంటూ పొదుపుగా పొదుపుగా బట్టలు వేసుకుంటుంటే... కీర్తి మాత్రం నిండు చీరలో కనిపిస్తుంది. కళావతి సాంగ్ లో సన్నన్ని జారీపోయే చీరలో కనిపించినప్పటి నుంచి ఈ ముద్దుగు మ్మకు చీరపై మరింత మోజు పెరిగినట్లుంది. తాజాగా ఎల్లో కలర్పూల చీరలో మెరిసింది. రెండు ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన కీర్తి. 'షేడ్స్ ఆఫ్ సమ్మర్' అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం కీర్తి నాలుగు సినిమాల్లో నటిస్తోంది. వాషి (మలయాళం), మామన్నన్ (తమిళ్). దసరా, భోళాశంకర్ సినిమాలు చేస్తోంది.