యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ బుచ్చి బాబు సానాతో ఒక సినిమా చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే తారక్ పుట్టినరోజున ప్రశాంత్ నీల్, కొరటాల శివతో సినిమాలు అనౌన్స్ చేసారు కానీ ఈ సినిమా గురించి అనౌన్స్ చేయలేదు. ఈ రెండు సినిమాల నిర్మాణానికి కనీసం రెండేళ్లు పడుతుంది అని అందరూ భావిస్తున్నారు. దాంతో బుచ్చిబాబు మరో కంటెంట్ బేస్డ్ సినిమాతో ముందుకు రావడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాడని, త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ ని ఈ హీరోతో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి కొన్ని రోజులు వేచి చుడాలిసిందే.