ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ కు మలయాళ భామ ఆత్మీయ రాజన్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 03:03 PM

తెలుగు తెరకి మొదటి నుంచి కూడా మలయాళ భామల తాకిడి ఎక్కువే. ఇక్కడ బాలీవుడ్ భామల జోరుకు బ్రేకులు వేసింది మలయాళ మందారాలే. అదే దారిలో ఇప్పుడు మరో మలయాళ భామ 'శేఖర్' సినిమాతో పరిచయమవుతోంది .. ఆ సుందరి పేరే ఆత్మీయ రాజన్. రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలవుతోంది.


జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్' సినిమాకి రీమేక్. ఆ సినిమాలో పాటలు ఉండవు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా చేసిన మార్పుల వల్ల ఇందులో పాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఆ సినిమాలో ఆత్మీయ రాజన్ పోషించిన పాత్రకిగాను, తెలుగులోను ఆమెనే తీసుకున్నారు.


ఇటీవలే  రాజశేఖర్ .. ఆత్మీయ రాజన్ పై చిత్రీకరించిన ఒక పాటను కూడా విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com