ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ స్టార్ తమిళ్ రీమేక్ పై సర్ప్రైజింగ్ అప్డేట్... త్వరలోనే ఎనౌన్సుమెంట్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 11:47 AM

రాజకీయాల కోసం సినిమాల నుండి కొంత విరామం తీసుకుని, తిరిగి సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుండి పవర్ స్టార్ స్ట్రయిట్ తెలుగు సినిమాల కన్నా రీమేక్ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు . అలానే ఇటీవల పవన్ నటించిన కొత్త చిత్రం భీమ్లానాయక్. ఈ సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనం కోషియం కు తెలుగు రీమేక్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే, గత కొద్దిరోజుల నుండి, పవన్ మరో రీమేక్ లో నటించబోతున్నాడంటూ చిత్రసీమలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రఖని డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం వినోదయ సిత్తం ను పవన్ తెలుగులో రీమేక్ చెయ్యాలనుకుంటున్నారని, ఆ ప్రాజెక్టు కు సముద్రఖని డైరెక్షన్ చేస్తారని... జోరుగా ప్రచారం జరుగుతుంది. 


తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సముద్రఖని ఈ విషయంపై పవన్ అభిమానులకు సూపర్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు నేను అభిమానిని. అభిమానులు ఎలా అయితే తెరపై పవన్ ను చూడాలనుకుంటారో నేను ఆయన్ను అలానే చూపిస్తా. త్వరలోనే పవన్ ఫ్యాన్స్ కు కొత్త శుభవార్త అందుతుంది.... అని సముద్రఖని తెలిపారు. దీంతో, ఆ శుభవార్త ఏమై ఉంటుందా అని పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  వినోదయ సిత్తం తెలుగు రీమేక్ లో లీడ్ హీరోగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించనున్నారని టాక్. కీలకపాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తారు. వచ్చే జూన్ నుండే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com