బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. "ఆదిపురుష్" సినిమా జనవరి 12, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ్యూక్టన్ పనులలో బిజీగా ఉంది. తాజా అప్డేట్ ప్రకారం, ఓం రౌత్ తన కొత్త సినిమాని స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఒక ప్రముఖ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమైంది అని వార్తలు వినిపిస్తున్నాయి.