టాలీవుడ్ హీరో ఆదిసాయికుమార్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్స్ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాభవం ఏమి చూపలేదు.తాజాగా ,ఫణికృష్ణ దర్శకత్వంలో ఆదిసాయికుమార్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రకటించాడు.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.తాజాగా ఈరోజు ఈ చిత్రంలో ఆది సరసన జోడిగా దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ ప్రాజెక్ట్ కి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు.కేకే రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ధృవన్ సంగీత దర్శకుడు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.