ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజే ట్రైల‌ర్ రివ్యూః ఒక‌వైపు తెడ్డు తిప్పుతాడు.... మ‌రోవైపు తెడ్డు తిర‌గేస్తాడు

Andhra Pradesh Telugu |  PTI  | Published : Sat, Feb 25, 2017, 06:29 PM

 సినిమా డెస్క్ః గణపతి స్త్రోత్రంతో మొదలైన ట్రైలర్ చూస్తుంటే.... అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన ‘భద్రీనాధ్’ సినిమా గుర్తుకొచ్చింది. అది భక్తి నేపథ్యంలో రాగా.... ఇది శివ భక్తుడి రూపంలో.  బహుశా అల్లు ఇందులో దుష్ట శిక్షణ కోసం శివ తాండవం చేసేస్తాడని అనుకోవచ్చు. సినిమాల్లో బ్రాహ్మణ పాత్రల్ని బలహీన పాత్రలుగానే చూపిస్తారు. హీరో పాత్రే బ్రహ్మణ పాత్ర కాబట్టి... హీరోయిక్ గానే చూపించాలి. ట్రైలర్ ఓపెన్ అయిన వెంటనే గణపతి స్తోత్రం... ఆ తర్వాత నుదిటిన పుండ్రాళ్లు పెట్టుకునే విధానం (గుర్తుకు రాకపోతే మరోసారి ట్రైలర్ చూడండి) చూస్తుంటే హీరో... దుష్టుల పని పట్టడానికే సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఆ తర్వాత నట్టింట ఊయల ఊగడం కూడా ఇదే చెబుతుంది. అంటే ఒక ఊర్లో.... పెళ్లిళ్లకు క్యాటరింగ్ చేసుకునే హీరో.... సమాజంలో ఉన్న శత్రువుల పని పడతాడన్నమాట. ఈ కథను తేలికగానే ఊహించవచ్చు. ఇందులో కొత్తదనం కనిపించడాని అవకాశం తక్కువే. అసలు కథ  ఏమిటన్నది ఇపుడే తెలియదు కాబట్టి... మనం ఇలా ఊహించుకోవచ్చు.క్యాట‌రింగ్ చేసుకునే హీరో... తానెవ‌రో తెలియ‌కుండా... శ‌త్రువుల‌ను గుర్తించి వారిని హ‌తం చేయ‌డం... ప‌ని అయిన త‌ర్వాత వ‌చ్చేసి ఏ పెళ్లి మండ‌పంలోనే నుదిటిన పుండ్రాళ్ల‌తో అమాయ‌కంగా తెడ్డు తిప్పుతూ ఉంటాడ‌న్న‌మాట‌.చివ‌రికి చ‌ట్టం ముందు త‌ల‌వంచినా.... స‌మాజంలో ఉన్న చెడు పురుగుల్ని ఏరివేస్తాడు కాబ‌ట్టి... ప్రేక్షకుల దృష్టిలో హీరో హీరోగానే ఉంటాడు (చ‌ట్టం దృష్టిలో కాక‌పోవ‌చ్చు). ఒక‌ర‌కంగా హాలీవుడ్ లో పూర్వం వ‌చ్చిన విజిలాంటిజం త‌ర‌హా సినిమాలా ఉంటుంద‌ని ఊహించ‌వ‌చ్చు. ఏమైనా సినిమా వచ్చే వ‌ర‌కూ వేచి చూద్దాం.మ‌ధ్య మ‌ధ్యలో హీరోయిన్ ముద్దులు.... ఫ‌క్తు సంప్ర‌దాయ బ్ర‌హ్మ‌ణ పాత్ర‌కు అలా వ‌చ్చి ముద్దులు పెట్టేస్తే కాస్త కొత్త‌గానే ఉంటుంది. అందుకే హీరో డైలాగ్ అలా ఉంది... ‘‘ఇలా ముద్దులు పెట్టేస్తే స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇద్దామ‌ని’’... సంప్రదాయంతో మిక్స్ చేసిన జోకులూ గట్రా మామూలే.కథ మాట ఎలాగున్నా... అల్లు అర్జున్ మాత్రం ఇచ్చిన పాత్రకు ప్రాణం పోసేస్తాడు. బ్రాహ్మణ పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసేశాడు... అల్లు కుమ్మేస్తాడు సందేహం లేదు. మరి హ‌రీష్ శంక‌ర్ కథను ఎలా చూపిస్తాడో... ఏం మాయాజాలం చేస్తాడో...?!!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com