గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ లోని శ్రీ రాంఛోడ్జీ ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ఆ సందర్భంగా రాహుల్ కు మోడీ మోడీ అన్న నినాదాలతో స్వాగతం లభించింది. ఆలయం నుంచి రాహుల్ బయటకు వస్తుండగా అక్కడ గుమిగూడిన జనం మోడీ అనుకూల నినాదాలు చేశారు. అయితే రాహుల్ చిరునవ్వుతో వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.