కొన్ని చిత్రాలు ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయి. ఆ జాబితాలు ఇపుడు పుష్ప చిత్రం చేరింది. అల్లు అర్జున్ 'పుష్ప' రాజ్ మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్‌కి దేశ వ్యాప్తంగా ఎంత పాప్యులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కొందరు పుష్పలా వేషాలు వేసి, ఈ సినిమాలో బన్నీలా నడుస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. ఇలా, పది మంది ఒకేసారి పుష్ప రాజ్‌లా వేషధారణతో ఓ వీధిలో తిరిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూపించేలా ఈ వీడియో ఉంది. 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగులను చెబుతూ వారు నడుచుకుంటూ వెళ్లారు. ఇటీవల ఓ వ్యాపారి పుష్ప చీరలు కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అబ్బాయిల దుస్తులపై కూడా పుష్ప లోగోలు ముద్రిస్తున్నారు. పుష్ప సినిమాలోని దృశ్యాలను చీరలపై ప్రింట్ చేసి అమ్మారు. పుష్పను అన్ని రంగాల్లోని వారు వాడేసుకుంటున్నారు.