రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న ముక్తాపురం చెరువు నిండి మరువ పారుతోంది. ఈ సంధర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ చెరువులో గంగ పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న రాజ్యమంతా సస్య శ్యామలం. జగనన్న రాజ్యంలో నీటికొరత అనేది రాదు. రాష్ట్రమంతా సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉంటుంది. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో తాగడానికే నీటి కరువు అని బాధపడే రోజుల నుంచి నేడు జగనన్న పరిపాలన వచ్చేసరికి చెరువులు, పొంగి ప్రవహిస్తున్నాయి. దేవుడు కరుణించాడు రాజుని బట్టి పరిపాలన ఉంటుంది. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అలాగే మన జగనన్న పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని వివరించారు.
పార్టీలు, కులమతాలను చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ చెరువు కింద వెయ్యి ఎకరాల దాకా ఆయకట్టు భూమి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులతో పాటు పీఏబీఆర్ కుడి కాలువ నుంచి సక్రమంగా నీరు వదలక పోవటంతో 2003 నుంచి ఈ చెరువు ఒక్కసారి కూడా నిండలేదు. పీఏబీఆర్ కుడికాలువ కింద అన్ని చెరువులతో పాటు ముక్తాపురం చెరువు నీళ్లు వదలడంతో మరువ పారుతుండటంతో రైతన్నల రెండు దశాబ్దాల కల నెరవేరింది.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మామిళ్ళపల్లి అమర్నాథ్ రెడ్డి చెన్నేకొత్తపల్లి నర్సిరెడ్డి, రాప్తాడు వైసిపి యూత్ కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీలు, సర్పంచులు, డైరెక్టర్లు, చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.