ఇటీవల వివాహ వేడుకలను అంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్లు, పెళ్లి వేడుకలో డ్యాన్స్‌లు, అతిథులను సర్ప్రైజ్ చేయడం ఇలా వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలో వధువు కూడా వెరైటీగా ప్రయత్నించింది. అయితే ఆమె చేసిన పనికి పెళ్లికొడుకుతో సహా వేడుకకు వచ్చిన అతిథులంతా హడలెత్తిపోయారు. కొద్దిసేపటికే తేరుకుని, అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో ఓ వివాహ వేడుకలో వధువు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిజైనర్ రూపొందించిన గులాబీ రంగు చీరను వధువు ధరించింది. దానికి తగ్గట్టే ఆభరణాలు ధరించింది. ఇతరత్రా ముస్తాబులు బాగా చేసుకుంది. ఎంతో అందంగా, ఒద్దికగా నడుచుకుంటూ వేడుక సమయంలో మండపం పక్కకు వచ్చింది. అతిథులంతా ఆమె ఏం చేస్తుందోననే ఉత్కంఠ, ఆత్రుతతో చూస్తున్నారు. అందరూ తనవైపే చూస్తున్నారని తెలుసుకున్నా తర్వాత వధువు తన దుస్తుల్లోంచి గన్ను తీసింది. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో చాలా తేలిగ్గా గాల్లోకి కాల్పులు జరిపి, అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒక్కసారిగా అతిథులుంతా అవాక్కయ్యారు. ఆమెకు దూరంగా వెళ్లిపోయారు. ఈ వీడియోను దీపేష్ అనే యువకుడు(దీపేష్966) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో చూసిన నెటిజన్లంతా ఆమె తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.