నంద్యాల ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన భూమా బ్రహ్మానందరెడ్డి దాదాపు 27వేల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా... శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ రూల్స్ బుక్ ను బ్రహ్మానందారెడ్డికి స్పీకర్ అందించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, భూమా అఖిల ప్రియ సమక్షంలో బ్రహ్మానందారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.