మాస్కో: విలాసాలు, రాజభోగాలకు పెట్టింది పేరు సౌదీ రాజు సల్మాన్. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా సొంత విమానంలోనే ప్రయాణిస్తుంటారు. విమాన ఎస్కలేటర్‌ను కూడా బంగారంతో తయారు చేయించుకున్నారు.
గ్లోబల్ చమురు మార్కెట్, సిరియా సంక్షోభంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చిచేందుకు ఇటీవల ఆయన మాస్కో వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన తర్వాత బంగారు ఎస్కలేటర్ మధ్యలోనే ఆగిపోయింది. అది తిరిగి పనిచేస్తుందేమోనని సల్మాన్ కాసేపు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఒక్కోమెట్టూ దిగుతూ కిందకి వచ్చారు.
ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్నవారు వీడియో తీయడంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. రాజుగారి బంగారు రథం ఆగిపోయిందే అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.