లండన్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిస్ట్రల్‌లో సోమవారం ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఎలాంటి చార్జ్ లేకుండానే సాయంత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం వెస్టిండీస్‌తో జరిగే నాలుగో వన్డేలో ఆడడం లేదు. స్టార్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ కూడా ఆడడం లేదు. బ్రిస్టల్ ఘటనలో స్టోక్స్‌కు తోడుగా ఉన్న హేల్స్ కూడా విచారణ కోసం పోలీసులకు సహకరించేందుకు బ్రిస్టల్ వెళ్లనున్నాడు.
వెస్టిండీస్‌తో మూడో మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో బెన్‌స్టోక్స్, అలెక్స్ హేల్స్ ఉన్నట్టు సమాచారం. ఆ రాత్రి అక్కడ ఏదో గొడవ జరిగింది. రోడ్డుపై ముఖంపై గాయాల పాలై రోడ్డుమీద పడున్న వ్యక్తిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అతడి సమాచారం మేరకు స్టోక్స్‌ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత ఎలాంటి చార్జ్ లేకుండా వదిలేశారు.