లావా కంపెనీకి చెందిన ఫీచర్‌ఫోన్ కొనుగోలుపై వొడాఫోన్ తన నూతన కష్టమర్లకు రూ.900 క్యాష్ బాక్యక్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ పొందాలంటే నెలకు కనీసం రూ.100 రీఛార్జీ చేయిస్తే రూ.50 చొప్పున 18 నెలల్లో క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపింది. అటు వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ‘వొడాఫోన్ ప్లే యాప్’ ద్వారా ఏడాది పాటు ఉచితంగా సినిమాలు వీక్షించవచ్చని వొడాఫోన్ వెల్లడించింది.