ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడుగులంటే అంత అలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:32 AM

 -పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి


 -ప్రస్తుతమున్న రిజర్వేషన్లు పెంచాలి


 -విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించారా?  


 -ఇంకా ఎన్నాళ్లిలా మోసం చేస్తారు  


 -గతంలో ఇంటికో ఉద్యగామిస్తానన్న సీఎం కేసీఆర్‌  


 -ఇప్పుడు విద్యా,  ఉద్యోగాల్లేవన్నట్లు తెగేసి చెప్పే ప్రయత్నం  


 -బడుగులకు విద్యా,  ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందే  


 -వచ్చే ఎన్నికల కోసమే  బీసీలకు తాయిలాలు  


 -గుర్తించిన బీసీ సమాజం  


 -కాంగ్రెస్‌ ద్వారానే బీసీలకు న్యాయం  


 -అధిష్ఠానం ఆదేశిస్తే బీసీలకు ఏకం చేసేందుకు కృషి  


 -జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్నింటా అవకాశాలు కల్పించాలి  


 -ఏఐసిసి కార్యదర్శి వి.హన్మంతరావు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : బడుగులంటే అంత అలుసా  ఏఐ సిసి కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ.హన్మంతరావు ప్రశ్నించారు. తక్షణమే పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లను జనాభా దమా షా ప్రకారం పెంచాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో బడుగు బలహీన వరాలను అణిచివేసేందుకు  కుట్ర జరుగు తోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇంకా ఎన్నాళ్లూ తాయిలాల పేరిట  బడుగులను మోసం చేస్తారంటూ ఆయన ప్రభుత్వాన్ని సూటిగా  ప్రశ్నించారు. విద్యా,  ఉద్యోగ రంగాలను బడుగులను  బలహీన పరిచి కుల వృత్తుల వైపు  మళ్లించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కుట్ర చేస్తుందని వీహెచ్‌ ఆరోపించారు. గతంలో  ఇంటికో ఉద్యోగం  ఇస్తానని చెప్పి,  ఎవరు ఖాళీగా కూర్చోవద్దన్న ముఖ్యమంత్రి విరు చుకుపడ్డారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ బీసీలపై ముఖ్యమంత్రి కేసీ ఆర్‌  మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే, బడుగు, బలహీనవర్గాలు చేపలు, గొర్రెలు పెంచుకొని బతకాలని,  ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు. బడుగు యువకులు చదుకుంటే,  ఉద్యోగాలు అడుగుతారని  అందుకు చదవకుండా ఉండేందుకు ముందస్తు గానే  కుట్ర చేస్తు న్నట్లు కనిపిస్తోందని వీహెచ్‌  గొర్లు,  చేపల పేరిట  తాయిలాలు ప్రకటించి ఇంకా ఎన్ని ఏళ్ళు మోసం చేస్తా రని ప్రశ్నించారు. కెసిఆర్‌ తాయిలాలు చూసి మోసపోయేందుకు బిసి యువత సిద్ధంగా లేరన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా తమ హక్కుల సాధనే లక్ష్యంగా బడుగు, బలహీనవర్గాలు ఈప్రభుత్వాన్ని నిలదీస్తాయన్నారు.  తాము గొర్రెలు  మేపుతుంటే,  అగ్రకులాల పిల్లలు చదువుకోవాలా ? అని బిసి విద్యా ర్థులు ప్రశ్నిస్తున్నారని వీహెచ్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశా బ్దల తరువాత కూడా తాము గొర్లు మేపుతూ,   చేపల పెంపకానికే పరిమితం కావాలా? అంటూ సర్కార్‌ను నిలదీస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  బడుగు, బలహీనవర్గాల  పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు  సర్కార్‌ కృషి చేయా లని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న బీసీలు సామాజికంగా అభివృద్ధి చెందేందుకు,  మెరుగైన విద్యాసౌకర్యాలు కల్పించాల న్నారు. అంతేకానీ గొర్రెలు, చేపలు  పెంచుకోవాలంటూ పేర్కొనడం హాస్యాస్ప దంగా ఉందని వీహెచ్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసమే కెసి ఆర్‌ ఇప్పటి నుంచే బిసిలకు గొర్లు,   చేప లంటూ తాయిలాలు ఇచ్చే ప్రక్రి య మొదలు పెట్టారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని  బీసీ సమాజం కేసీఆర్‌ రాజకీ యపు ఎత్తుగడను గమనించలేనంత అమాయకత్వంగా లేదన్నారు. ముఖ్యమంత్రికి నిజంగానే  బీసీలపై చిత్తశుద్ధి ఉంటే విద్యా, ఉద్యోగాల్లో రిజర్వే షన్లు కల్పించడంతో,  రాజకీయంగా లబ్ది పొందేలా కార్యచరణ రూపొందిం చాలన్నారు. అంతేకానీ కులవృ త్తులను ప్రోత్సాహిస్తున్నామని, చేతివృత్తులకు చేయూతనిస్తున్నామని చెప్పి బడు గులను మరోసారి వెనక్కినెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. జనాభా ప్రాతిపదికన బిసి లకు న్యాయం జరగడం లేదని వీహెచ్‌ అన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు దామాషా ప్రకారం విద్య, ఉద్యోగా వకాశాలతో పాటు, రాజకీయాల్లో రిజర్వే షన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  బీసీలకు రాజకీయంగా మెరుగైన అవకా శాలు కల్పించింది కాంగ్రెస్‌పార్టీ ఒక్కటే నన్నారు. భవిష్యత్తులో కూడా  బీసీలకు  కాంగ్రెస్‌ పార్టీతోనే న్యాయం జరుగు తుందన్నారు. హైకమాండ్‌ అనుమతి ఇస్తే, రాష్ట్రంలోని  బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రతి గ్రామాన్ని చుట్టివస్తానని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com