ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య స్నానం చేయడం లేదని విడాకులు కోరిన భర్త

national |  Suryaa Desk  | Published : Fri, Sep 24, 2021, 03:49 PM

భార్య రోజూ స్నానం చేయడం లేదని ఓ భర్త విడాకులు కోరాడు. ఈ ఘటన యూపీలోని అలీఘడ్‌ లో జరిగింది. క్వార్సీ గ్రామానికి చెందిన మహిళకు, చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య ప్రతి రోజూ స్నానం చేయడం లేదని భర్తకు కోపం వచ్చేది. ఈ విషయంపై ప్రతి రోజూ వారి మధ్య గొడవ జరిగేది. దీంతో విసుగు చెందిన భర్త, భార్యకు విడాకులు ఇచ్చేందుకు 3 సార్లు తలాక్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ భార్య అలీఘడ్‌ మహిళా రక్షణ సెల్‌ ను ఆశ్రయించింది. దీంతో అధికారులు దంపతులిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చారు.


తమ వివాహ బంధం కొనసాగాలని భార్య కోరుతోంది. భర్త మాత్రం విడాకులు కావాలంటున్నాడు. తన భార్య ప్రతి రోజు స్నానం చేయదని, దీంతో రోజూ తమ మధ్య గొడవ జరుగుతోందని చెప్పాడు. అందుకే తమకు విడాకులు మంజూరు చేయాలంటూ దరఖాస్తును కూడా అందజేశాడు. అయితే సమస్య చిన్నది కావడంతో భార్యాభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా రక్షణ సెల్‌ కౌన్సిలర్ తెలిపారు. ఇది గృహహింస చట్టం కిందకు రానందున విడాకుల పరిధిలోకి రాదని చెప్పారు. తమ వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు దంపతులిద్దరూ ఆలోచించుకోవాలని చెప్పామని, దీనికి కొంత గడువు ఇచ్చినట్లు వివరించారు. ఈ భార్యాభర్తల సమస్యలను కౌన్సిలింగ్‌ సహాయంతో పరిష్కరిస్తామని కౌన్సిలర్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com