ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి పాలతో ఎన్నో లాభాలు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 14, 2021, 05:00 PM

కొబ్బరి పాలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి పాలల్లో షుగర్, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. వీటిని పాలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.


కొబ్బరి పాలు రక్తపోటును మెరుగుపరుస్తాయి. కొబ్బరి పాలల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిలో విటమిన్ సి, ఇ, బి1, బి3, బి5, బి6, ఐరన్, సెలీనియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఉంటాయి


కొబ్బరి పాలల్లో లౌరిక్ అమ్లం ఉంటుంది. అంతేకాకుండా.. చైన్ ఫ్యాటీ యాసిడ్ శరీరంలో మోనోలౌరిక్‏ గా మారుతుంది. ఇది మెదడు పనితీరు, ఎముకల ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.


కొబ్బరి పాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. జట్టు పెరుగుదలకు సహాయపడతాయి. రోజు కొబ్బరి పాలతో 3 నుంచి 5 నిమిషాలు జుట్టుపై మసాజ్ చేసి.. 20 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయడం వలన జుట్టు సమస్యలు తగ్గుతాయి.


కొబ్బరి పాలల్లో 2 చుక్కల ఆలీవ్ ఆయిల్ కలిపి కాటన్ ‏తో మేకప్ తొలగించాలి. ఇది చర్మాన్ని శుభ్ర పరుస్తుంది.


కొబ్బరి పాలల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన మొటిమలను నియంత్రించవచ్చు. అలాగే ముఖంపై ఉండే రంధ్రాలను ఇవి తెరుచుకునేలా చేయడం ద్వారా మొటిమల సమస్యను నివారించవచ్చు. అలాగే కొబ్బరి పాలలో ఓట్స్ కలిపి 10 నిమిషాలు ముఖంపై అప్లై చేసి.. శుభ్రం చేసాక ముఖం మరింత మెరుపునిస్తుంది.


కొబ్బరి పాలల్లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ముడతలు, వయస్సు మచ్చలను తగ్గించడంలో కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. 6 నుంచి 7 బాదం పప్పులను రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటి పొట్టును తొలగించి పేస్ట్‏ గా చేయాలి. అందులో 5-6 చుక్కల కొబ్బరి పాలు కలిపి ఆ మిశ్రమాన్ని 15 నిమిషాలు ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.


కొబ్బరి పాలను సూర్యరశ్మి చర్మానికి వాడడం వలన శోథ నిరోధక లక్షణాల వలన చర్మ సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. నొప్పి, వాపు, మంట తగ్గుతుంది.


కొబ్బరి పాలను 20-30 నిమిషాల పాటు చర్మంపై నేరుగా రాయాలి. అలా చేస్తే చర్మం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఒక కప్పు గులాబీ రేకులు, 1/2 కప్పు రోజ్ వాటర్, కప్పు కొబ్బరి పాలను ఒక టబ్‏ లో గోరువెచ్చని నీటిలో కలపాలి. ఆ నీటితో స్నానం చేయడం వలన చర్మం నిత్యం తేమగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు వోట్మీల్ పేస్ట్ గా చేసి 1-2 కప్పుల కొబ్బరి పాలను ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి కూడా ఉపయోగించవచ్చు.


కొబ్బరి పాలు.. చర్మ శోథ, సోరియాసిస్, పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సహజ కొవ్వు ఆమ్లాలు ఉండడం వలన పొడి చర్మం, మంట, దురద వంటి సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com