రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చారు. 755 మంది అమెరికా దౌత్య అధికారులను రష్యా నుంచి పంపించి వేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్ర్రక్రియ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ కాంగ్రెస్‌లో పాసైన బిల్లే పుతిన్ తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రోస్సియా నెట్వర్క్ 1 అనే రష్యన్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో.. అమెరికాతో సత్సంబంధాల కోసం రష్యా ఎదురుచూపులు చూసి చూసి విసిగిపోయిందని పుతిన్ అన్నారు.
ప్రస్తుతం రష్యాలో దేశ రాజధాని మాస్కోతో కలిపి ఐదు అమెరికన్ ఎంబసీలు ఉన్నాయి. వీటిలో 1200లకు పైగా అమెరికన్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. రష్యా తాజా నిర్ణయంతో అన్ని ఎంబసీల్లో కేవలం 455 మంది అధికారులను అమెరికా కొనసాగించాలి. అమెరికాలో రష్యన్ ఎంబసీల్లో కూడా కేవలం 455 మంది క్రెమ్లిన్ అధికారులు మాత్రమే పని చేస్తున్నారు.