చిత్తూరు: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం కల్యాణవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హనుమంత వాహనంపై కోదండరామ ఆలకారంలో భక్తులకు కల్యాణ వెంకటేశ్వరస్వామి దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఒత్తిళ్లు, తొక్కిసలాటలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.